టాలీవుడ్ మోస్ట్ బ్యూటీ ఫుల్ కపుల్ గా పేరుతెచ్చుకున్న చై సామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక విడాకులు తీసుకొని ఏడాది అవుతున్నా.. ఇప్పటికీ వీరి విడాకుల గురించి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే  పెళ్లి అయ్యాక 4 ఏళ్ల పాటు సంతోషంగా కాపురం చేసిన వీరిద్దరూ..ఊహించని విధంగా విడాకులు తీసుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. ఇక ముఖ్యంగా విడాకుల తర్వాత ఒకటి రెండు సందర్భాలలో తప్ప ఎప్పుడూ కూడా సమంత గురించి చైతన్య మాట్లాడలేదు.  సమంత మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా చైతూ పై కామెంట్లు చేస్తూ రివేంజ్ తీర్చుకునే ప్రయత్నం చేసింది.. 

అంతేకాదు నాగచైతన్య పై సమంత కొన్నిసార్లు డైరెక్ట్ గా.. మరికొన్నిసార్లు ఇన్ డైరెక్టుగా కామెంట్లు చేసి ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది.ఇక గతంలో ఒక ఇంటర్వ్యూలో సమంత , నాగచైతన్య తో పాటు రాహుల్ రవీంద్రన్ కలిసి ఒక సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.కాగా  ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ రవీంద్రన్ నాగచైతన్యను ఒక ప్రశ్న అడిగాడు..' నువ్వు సమంతకు ఎప్పుడు ప్రపోజ్ చేశావు' అని అడగ్గా.. బదులుగా చైతు ఊహించని ఆన్సర్ ఇచ్చాడు..ఇకపోతే ' సమంతను ఇంప్రెస్ చేయడానికి ఆరు సంవత్సరాల సమయం పట్టింది ..వేరే అవకాశం లేక సమంతను పెళ్లి చేసుకున్నాను ' అని చెప్పాడు.

 రాహుల్ రవీంద్రన్ ఇదే ప్రశ్నను సమంతని కూడా అడగగా.. ఆమె ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ గానే మాట్లాడింది.కాగా  'నాతో పరిచయం ఏర్పడ్డ తర్వాత నాగచైతన్య ఈ ఏడు సంవత్సరాల లో చాలామంది అమ్మాయిల వెంటపడ్డాడు. ఇక ఏడేళ్ల తర్వాత నా టోకెన్ నెంబర్ వచ్చింది.  అయితే అందుకే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు' అంటూ ఊహించని కామెంట్లు చేసింది.అయితే  దీన్నిబట్టి చూస్తే సమంత విడాకుల వెనుక కూడా ఏదైనా తప్పు జరిగిందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మొత్తానికైతే అక్కినేని వారసుడిపై ఇలాంటి షాకింగ్ కామెంట్లు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది సమంత.కాగా ప్రస్తుతం విడాకుల తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇక నాగచైతన్య లాల్ సింగ్ చడ్డా, థాంక్యూ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. సమంత యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: