
ఈ సినిమా డిజాస్టర్ కావడంతో కొరటాల కెరీర్ లోనే మొదటిసారి బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా పడిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గురించి చాలాసార్లు చాలామంది స్పందించడం జరిగింది. ఆఖరికి చిరంజీవి కూడా ప్రస్తావిస్తూ తాము డైరెక్టర్ చెప్పిన విధంగానే చేసామని ఈ సినిమా ఫెయిల్యూర్ మొత్తం కొరటాల శివ ఖాతాలోకి వెళ్తుందని స్పష్టం చేశారు. దీంతో ఈ విషయంపై అప్పట్లో పెద్ద చర్చలు జరిగాయి. అయితే సినిమా గురించి అంతా సద్దుమణిగింది అనుకునే లోపే ఇప్పుడు మణిశర్మ కూడా చేసిన కామెంట్లు సంచలనంగా మారుతున్నాయి.
తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి పాల్గొన్న మణిశర్మ ఆచార్య సినిమా గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవికి ఏ తరహా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వాలో తనకు బాగా తెలుసు అని, అందుకే తాను ఆచార్య సినిమాకి కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందివ్వాలని అనుకున్నాను అయితే తాను అనుకున్నది కాకుండా డైరెక్టర్ గారు చెప్పినది చేయాల్సి వచ్చింది. తాను మొదట అనుకున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయ్యి ఉంటే కచ్చితంగా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యేది అంటూ మణిశర్మ చెప్పడంతో ఈయన కూడా పరోక్షంగా ఆచార్య సినిమా ఫ్లాప్ కొరటాలదే అని చెబుతున్నారు. మొత్తానికైతే అందరూ కలిసి కొరటాల శివ ను బలి పశువును చేస్తున్నారని స్పష్టమవుతోంది.