సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో చాలా వేగంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పూర్తి చేశారు. వీరసింహ రెడ్డి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.ఈ చిత్రంలో బాలయ్య చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. శ్రుతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈ మూవీతో పాటు ఇప్పుడు సక్సస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా మరో మూవీ చేస్తున్నారు. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఇంకా అలాగే హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అవ్వడం జరిగింది.ఇక ముహూర్తం షాట్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్‌ ఇవ్వగా ఇంకా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్‌కి లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించడం జరిగింది.


మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, కిలారు సతీష్ ఇంకా అలాగే నిర్మాత శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ రోజు నుండే మంచి యాక్షన్ బ్లాక్ తో ప్రారంభం అయ్యింది. ఇక ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో ఫైట్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ ని నిర్మించడం జరిగింది.ఇక బాలకృష్ణ మునుపెన్నడూ కూడా పోషించిన పాత్రలో ఈ మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ మార్క్ మాస్ అండ్ యాక్షన్ ఇంకా అలాగే అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ వుండబోతున్నాయి. బాలకృష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఓ పవర్‌ఫుల్ కథను రాశారని సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిన కుర్ర బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. మ్యూజికల్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి ఇంకా అలాగే ఎస్ ఎస్ తమన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: