పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా భారీ అంచనాల మధ్య ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోలతోనే హిట్ టాక్ తో దూసుకుపోయిన ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ని చూపించిన తీరు అభిమానులను మరింత ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమా ప్రీమియర్ షోల రేట్లు భారీగా ఉన్నప్పటికీ అభిమానులు చూడడానికి మక్కువ చూపారు.. దీంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సినిమా టికెట్ల రేటును ఒక 10 రోజుల పాటు పెంచుకొనే సదుపాయాన్ని కల్పించారు. కానీ ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.


ఎన్నో చర్చలు, వివాదాలు , కోర్టు కేసుల అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఓజీ చిత్రానికి సంబంధించీ పెంచిన టికెట్ల రేట్లు తగ్గించి అమ్మాలి అంటూ ఒక ఆర్డర్ ని విడుదల చేశారు. వాస్తవానికి ఓజీ సినిమా రిలీజ్ కి ముందే టికెట్లు రేటు పెంచమని ప్రభుత్వాన్ని కోరగా అందుకు సంబంధించి జీవో జారీ చేసి సదుపాయాన్ని కల్పించింది. కానీ ఈ జీవో ని సస్పెండ్ చేసింది హైకోర్టు, అయినా సరే చాలా చోట్ల టికెట్ల రేటు పెంచి మరి అమ్మకాలు జరిగాయి.


తాజాగా ఈ విషయం పైన ప్రత్యేకించి శ్రద్ధ తీసుకున్న  తెలంగాణ ప్రభుత్వం..అనుమతించిన రేట్లకే టికెట్ అమ్ముకోవాలంటు  హెచ్చరించారు. లేనిపక్షంలో థియేటర్లో ఓనర్లపై కఠినమైన చర్యలు ఉంటాయంటూ తెలిపారు. కోర్టు చెప్పిన ప్రకారం టికెట్ల ధరలు తగ్గించడంతో.. ఓజీ సినిమా మల్టీప్లెక్స్ లకు రూ. 295 రూపాయల సింగిల్ స్క్రీన్ బాల్కనికి రూ. 175, లోయర్ క్లాస్ రూ. 110 రూపాయలు ధరలకే నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓజి సినిమాకి సంబంధించి టికెట్ల రేటు పెంచుకొనే సదుపాయాన్ని కల్పించింది.. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం  ఏపీ సినిమా థియేటర్ల మీద కూడా చూపిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: