అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొన నిర్ణయాలు చాలా దేశాలను ఇబ్బంది కలిగించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ పైన ఎన్నో రకాల టారిఫ్ చార్జీలను విధించిన ట్రంప్ తాజాగా ఇప్పుడు ఒక మరో పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విదేశీ సినిమాల పైన 100% టాక్స్ ప్రకటించారు. ఈ ప్రభావం అటు ఇండియన్ సినిమాల పైన కూడా భారీగా పడబోతోంది. ఎందుకంటే అమెరికాలో తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్ ఉన్నది. ఇప్పుడు తీసుకున్న ట్రంప్ నిర్ణయం వల్ల తెలుగు సినిమాలు అమెరికాలో విడుదలపై చాలా ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు సినిమాలకు కూడా 100% ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.


యూఎస్ఏ లో విడుదల కాబోతున్న ఇండియన్ చిత్రాలు, ఇతర దేశాల సినిమాల పైన 100% టాక్స్ విధించినట్లుగా తెలియజేశారు ట్రంప్. అయితే అమెరికాలో నిర్మించే సినిమాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని తెలియజేశారు. విదేశీ సినిమాలతో అమెరికా బిజినెస్ దెబ్బతింటోందనే ఉద్దేశంతోనే ఈ టాక్స్లు విధించామంటూ తెలిపారు ట్రంప్. అయితే సుంకాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే విషయాన్ని మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.


మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు పిల్లాడు నుంచి మిఠాయిని దొంగలించినట్లుగా దొంగలించాయి అంటూ తెలిపారు. ఇదంతా కూడా కాలిఫోర్నియాకు ఉన్నటువంటి బలహీన, అసమర్ధత గవర్నర్  వల్లే ఏర్పడిందంటూ తెలిపారు ట్రంప్. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యను నూరు శాతం సుంకాల విధించడం వల్ల పరిష్కారం లభిస్తుందని అమెరికాను మరొకసారి అగ్రస్థానంలో నిలుపుతానంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఒకప్పుడు అమెరికాకు మారుపేరుగా ఉన్నటువంటి హాలీవుడ్ ఇప్పుడు చాలా ఇబ్బందులలోకి పడిపోయిందని.. ఓటీటిలు రావడం వల్ల ప్రేక్షకులను థియేటర్లకు వెళ్లడానికి మక్కువ చూపడం లేదని తెలియజేశారు బాక్సాఫీస్ అమ్మకాలలో కూడా చాలా స్థాయిలో తగ్గుదల కనిపించిందంటు తెలిపారు. మరి ఎప్పటినుంచి వీటిని అమలులోకి తెస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: