
మిగతా నటులతో పోల్చి చూస్తే విలక్షణమైన నటనతో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరికీ కూడా బాగా దగ్గరయ్యారు బ్రహ్మానందం. ఇక ఇప్పటికీ కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఒకప్పుడు లెక్చరర్ గా పనిచేసిన ఈయన ఆహనా పెళ్ళంట అనే సినిమాతో ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి తరం హీరోలైనా ఏఎన్నార్ ఎన్టీఆర్ సహా నేటితరం హీరోల వరకు అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
అయితే ఇప్పుడు వరకు కమెడియన్గా నటించిన సినిమాల గురించి చెప్పమంటే టకా టకా చెప్పేస్తుంటారు ప్రేక్షకులు. కానీ బ్రహ్మానందం హీరోగా నటించిన సినిమా గురించి చెప్పమంటే మాత్రం చాలా మంది తెల్ల మొహం వేస్తారు ఎందుకంటే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బ్రహ్మానందం హీరోగా నటించిన ఒకే ఒక్క సినిమా బాబాయ్ హోటల్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మించారు. బ్రహ్మానందానికి జోడిగా మధుశ్రీ నటించింది. పిల్లలను చేరదీసి కాపాడే ఒక గొప్ప వ్యక్తి కదే బాబాయ్ హోటల్. ఇక ఈ సినిమా 1992లో విడుదలై ఎందుకో ఆశించిన స్థాయిలో మాత్రం విజయం సాధించలేదు.