బుల్లితెరపై యాంకర్ అనసూయ కు ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనసూయ అంటే జబర్దస్త్ కామెడీ షో అని టక్కున గుర్తుకువస్తుంది ప్రేక్షకులకు. ఈ కామెడీ షో వల్ల అనసూయ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇందులో వేసే డ్రెస్ ల వల్ల అనసూయ హాట్ యాంకర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య జబర్దస్త్ ను వీడడం జరిగింది అనసూయ. అయితే అందుకు గల కారణం ఏమిటా అనే విషయంపై అనసూయ ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తెలియజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన పైన వచ్చే కామెంట్లు, బాడీ షేవింగ్ ఇతర వాటిని తట్టుకోలేక ఆ షో ని వీడినట్లుగా సమాచారం.
ఎప్పుడైనా కాస్త గ్యాప్ దొరికినా సరే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. ఇటీవల పలు సినిమాలలో వరుసగా నటిస్తూ తన స్టామినా ఏంటో నిరూపించుకుంటోంది. ఈ సందర్భంగా తన నెక్స్ట్ సినిమాల లైనప్పును సైతం సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉంటుంది. అనసూయ అల్లు అర్జున్ ఎన్టీఆర్ ,పవన్ కళ్యాణ్ వంటి వారితో నటించబోతున్నట్లు అభిమానులతో చిట్ చాట్ ద్వారా తెలియజేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.హరిహర వీరమల్లు చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప -3 లో కూడా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ నటించబోతున్న 30వ సినిమాలో కూడా అనసూయ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాలతో పాటు రంగమార్తాండ సినిమాలో నటించడమే కాకుండా ఇతర భాషలలో కూడా పలు సినిమాలలో నటిస్తోంది అనసూయ. ఇదంతా ఇలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. టాప్ లెస్ దుస్తులను అనసూయ షేర్ చేసిన ఫోటోలకు కుర్రకారులు సైతం మంత్ర ముగ్ధులను అయ్యేలా చేస్తోంది పలు రకాల ఫోజులలో అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: