ఇక అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా గత ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా సోషల్ మీడియాలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే..తెలుగు వెర్షన్ జస్ట్ యావరేజ్ కాగా ఈ సినిమాని హిందీలోనే మాత్రం ఎగబడిమరీ చూసారు..మలయాళం , కన్నడ ఇంకా తమిళ బాషలలో కూడా ఈ సినిమా పర్వాలేదనిపించింది..RRR , బాహుబలి , kgf వంటి సినిమాల తర్వాత ఈ సినిమా కూడా దేశావ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలోని పాటలు, ..'తగ్గేదే లే' అనే మ్యానరిజం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి..క్రికెటర్స్ దగ్గర నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతీ ఒక్కరు తగ్గేదేలే మ్యానరిజం ని సందర్భాన్ని బట్టీ తెగ వాడేశారు..అయితే ఈ సినిమాని కొద్దీ రోజుల క్రితమే రష్యాలోని మాస్కో లో నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు.


దీనితో ఈ సినిమాని రష్యా దేశం మొత్తం ఘనంగా విడుదల చెయ్యాలని మూవీ టీం మొత్తం అక్కడ ప్రొమోషన్స్ లో భాగంగా వారం రోజుల పాటు రష్యా లోనే మకాం వేశారు.RRR జపాన్ లో ఎలా అయితే క్లిక్ అయ్యిందో, అలా ఈ సినిమా కూడా రష్యా లో దుమ్ము లేపేస్తుందని అనుకున్నారు.కానీ రష్యా లో ఇండియన్ సినిమాలకు అసలు మార్కెట్ లేదనే విషయం పుష్ప మూవీ టీం కి తెలియనట్టుంది..ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారని ఈ సినిమాని తప్పుగా అంచనా వేశారు.ఏకంగా 8 కోట్ల రూపాయిల దాకా ప్రొమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేసారు..కానీ విడుదలై వారం రోజులకి కనీసం 8 లక్షల రూపాయిలను కూడా ఈ సినిమా వసూలు చెయ్యలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాని బన్నీని సోషల్ మీడియా లో నెటిజెన్స్ తెగ ట్రోల్ చేసేస్తున్నారు..ఇక పుష్ప పార్ట్ 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: