టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ఇప్పటికే ఎన్నో విజయ వంతమైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా సీనియర్ స్టార్ హీరో లలో ఒకరిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాగర్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ దసరా పండుగ సందర్భం.గా అక్టోబర్ 5 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ , నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. దానితో ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ లో తన అంద చందాలతో కుర్ర కారు మనసు దోచుకుంది. అలాగే ప్రవీణ్ సత్తార్ కూడా ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ కింగ్ నాగార్జున తన తదుపరి మూవీ ని బెజవాడ ప్రసన్న దర్శకత్వం లో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి చిట్టురి శ్రీను నిర్మాత గా వ్యవహరించ బోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: