
చంద్రముఖి ఆ తర్వాత మలయాళ మూవీ మణిచిత్రతాజు , అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో భూల్ భులైయ్యా గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా అక్కడ కూడా బాగానే ఆడింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ ను చేయబోతున్నారు అని కోలీవుడ్లో గత కొద్ది రోజుల నుంచి వార్త వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలామంది సీక్వెల్లో కూడా జ్యోతికనే తీసుకుంటారని భావించారు. కానీ దర్శకుడు వాసు మాత్రం కంగనా రనౌత్ ను ఓకే చేశారు అని తెలుస్తోంది. ఈ సినిమాలో కంగనా రాజుగారి ఆస్థానంలో ప్రముఖ నర్తకి పాత్రలో కనిపించనుంది.
ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి ఆప్షన్ కంగనా రనౌత్ కాదట. ఈ విషయాన్ని స్వయంగా ప్రముఖ కొరియోగ్రాఫర్.. నటుడు.. దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రకటించాడు. మొదటగా చంద్రముఖి 2 సినిమాలో జ్యోతిక పాత్ర కోసం శృతిహాసన్ ను సంప్రదించామని ఆమె కూడా కథ నచ్చింది కానీ డేట్స్ కుదరక సినిమా నుంచి తప్పుకుంటున్నా అని తెలిపినట్లు రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు. దీంతో కంగనా రనౌత్ ను ఎంపిక చేసామని కూడా స్పష్టం చేశారు. ఏది ఏమైనా శృతిహాసన్ ఒక మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని మిస్ అవుతోందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.