
అయితే సావిత్రి కెరియర్ పూర్తిగా నాశనం కావడానికి.. చివరికి ఆమె మందుకు బానిసగా మారిపోయి దుర్భర స్థితిలో చనిపోవడానికి కారణం ఆమె భర్త అన్న విషయం ఇక మహానటి సినిమాలో చూసిన తర్వాత నేటి తరం ప్రేక్షకులకు అర్థమైంది అని చెప్పాలి. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా జెమినీ గణేష్ ను రెండో పెళ్లి చేసుకుంది. చివరికి జెమినీ గణేషన్ సావిత్రిని మోసం చేసి పుష్పవల్లితో ఎఫైర్ నడపడం తెలిసి సహించలేకపోయింది. సావిత్రి బాధతో మద్యానికి బానిసై ఇక కెరియర్ని చేజేతులారా నాశనం చేసుకుంది. ఇక తన దగ్గర ఉన్న దాన్ని దానధర్మాలు చేయడం ఇక నమ్మిన వాళ్లే మోసం చేయడం తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ సావిత్రి కి ఒక విలువైన సలహా ఇచ్చినా కూడా సావిత్రి ఎన్టీఆర్ సలహాలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంతో చివరికి ఎంతగానో నష్టపోయిందట. నిర్మాణరంగం నీకు సెట్ అవ్వదు హీరోయిన్ గానే కెరీర్ ని కొనసాగించు అంటూ ఎన్టీఆర్ సలహా ఇచ్చారట. నువ్వు నిర్మాణరంగంలోకి రావడం నాకు ఇష్టం లేక కాదు.. నీ మంచి కోరి చెబుతున్నాను అంటూ ఎన్టీఆర్ చెప్పిన.. సావిత్రి సీరియస్ గా తీసుకోలేదట. మొండి పట్టుతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి ఇక ఉన్నదంతా కోల్పోయిందట సావిత్రి. ఇక ఎన్నో సినిమాల్లో లాస్ రావడంతో ఇక సొంత ఇల్లును కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇలా ఎవరు చెప్పినా వినకుండా సావిత్రి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది అని తెలుస్తుంది.