పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే ఖుషీ, బద్రి వంటి సినిమాలతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈయన..హరిహర వీరమల్లు సినిమా షూటింగు లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఉస్తాధ్ భగత్ సింగ్ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. తాను పెట్టిన జనసేన పార్టీని ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనలో.. పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రథయాత్ర కూడా చేపట్టారు.  ఇందుకోసం వారాహి అనే కొత్త బండిని కూడా ఏర్పాటు చేసి అందులో యాత్ర మొదలు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్.  ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోకిరి సినిమాతో మొదలైన రీ రిలీజ్ సినిమాల హవా.. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలను కూడా విడుదల చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.


ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్తనే చెప్పాలి.  పవన్ కళ్యాణ్ నటించిన లవ్ క్లాసికల్ సినిమా ఖుషి రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ 31వ తేదీన 4K థియేటర్లలో ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఖుషి సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇదే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూపంలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టే అవకాశం కూడా కనిపిస్తోంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: