మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం ఏకంగా రెండు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో మొదటగా చిరంజీవి "ఆచార్య" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత చిరంజీవి ... మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో సల్మాన్ ఖాన్ ... సత్యదేవ్ ... నయన తార కీలక పాత్రలో నటించారు. ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న చిరంజీవి తాజాగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ లో హీరోగా నటించాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో బాబీ సింహా కనిపించనుండగా రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వసి రౌటేలా ఈ మూవీ లో ఐటమ్ సాంగ్ లో నటించింది.

మూవీ ని 13 జనవరి 2023 వ సంవత్సరం విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ విలేకరుల సమావేశంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కి ఇది ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ నా అనే ప్రశ్న ఎదురైంది ... ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇస్తూ ... రాసి పెట్టుకోండి వాల్తేరు వీరయ్య ఒక రొటీన్ ఎంటర్టైనర్ ... కానీ లోపల అదిరిపోయే విషయం ఉంటుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: