టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికే ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సీనియర్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న నాగార్జున ఆఖరుగా ది ఘోస్ట్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించగా ... సోనాల్ చౌహాన్మూవీ లో కథానాయకిగా నటించింది.

మూవీ మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. కాకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న నాగార్జున తదుపరి మూవీ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున ... రైటర్ ప్రసన్నకుమార్ డైరెక్షన్ లో ఒక మూవీ చేయబోతున్నట్లు కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి.

అయితే నాగార్జున మరియు ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ లో అల్లరి నరేష్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ... దాదాపు ఈ పాత్ర కూడా హీరోకు సమానంగా ఉండబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గతంలో కూడా నాగార్జున ఎంతో మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. అలా మరోసారి నాగార్జున ... అల్లరి నరేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నాగార్జున "ఊపిరి" మూవీలో కార్తీ తో కలిసి నటించగా... బంగార్రాజు మూవీలో నాగ చైతన్య తో కలిసి నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: