నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్థాపబుల్ అనే షోకి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవడంతో ఇటీవల సీజన్ 2 చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. సీజన్ 2 కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ కూడా స్ట్రీమింగ్ అవ్వడం జరిగింది. నిజానికి అన్ స్టాపబుల్ సీజన్ 1 అండ్ 2 లో ఎక్కువగా ఏది నచ్చింది అనే విషయానికొస్తే చాలామంది మొదటి సీజన్కే ఓటేస్తారు. ఎందుకంటే రెండవ సీజన్లో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. సీజన్ టు మధ్యలో వచ్చిన ఎపిసోడ్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 

దీంతో ఆఖరి మూడు ఎపిసోడ్లలో తిరిగి పూర్వ వైభవం తేవాలని ఆహా ప్లాన్ చేసింది మరి కొద్ది రోజుల్లోనే ఈ సీజన్ 2 కూడా పూర్తవుతుంది. సీజన్ 2 పూర్తికాకముందే అప్పుడే మూడో సీజన్ గురించి చర్చలు మొదలైపోయాయి. ఇందుకు కారణం తాజాగా స్ట్రీమింగ్ అయిన ప్రభాస్ ఎపిసోడే ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అన్స్టాపుల్ సీజన్ 3 లో వచ్చే గెస్ట్లు ఎవరు అనేది తెలిసిపోతుంది.ఇంతకీ సీజన్ 3 లో వచ్చే గెస్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తాజాగా విడుదలైన ప్రభాస్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ఫోన్ కాల్  మాట్లాడతారు.ఈ క్రమంలో బాలయ్య చరణ్ మాట్లాడుతూ నువ్వు ఎప్పుడొస్తున్నావు అన్ స్టాపబుల్ కి అని అడుగుతారు.

దానికి రాంచరణ్ జస్ట్ ఒక్క అడుగు దూరం సార్ మీరు ఎప్పుడంటే అప్పుడు రెడీ అని చెప్తాడు. దీంతో సీజన్ 3 లో రామ్ చరణ్ రాక కన్ఫర్మ్ అయినట్లే. అయితే సీజన్ 2 పూర్తికాకముందే సీజన్ త్రీ కోసం ఇప్పటికే గెస్ట్ లను ఎంపిక చేయడం మొదలుపెట్టేసాడు బాలయ్య. రెండో సీజన్లో మిస్సయిన స్టార్ సెలబ్రిటీస్ అందరిని మూడో సీజన్లో ఫుల్ గా కవర్ చేయాలని ఆహా టీం భావిస్తున్నారట. బాలయ్య ఆలోచనలోనే ఇది పూర్తిగా అర్థం అయిపోతుంది. అయితే సీజన్ 3 లో రామ్ చరణ్ తో పాటు మరికొంతమంది స్టార్ హీరోలతో సీజన్ ను చేయాలని అల్లు అరవింద్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీ నుండి కూడా సెలబ్రిటీలను తీసుకొచ్చే ఆలోచనలో ఆహా టీం ఉన్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా సీజన్ 1, సీజన్ 2 ని మించి సీజన్ 3 ని ఆహా టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: