రాజకీయ సభ అయినా, సినిమా ఈవెంట్ అయినా అది ఏదైనా సరే అది సక్సెస్ కావాలంటే సాధారణ జనం ఉండాల్సిందే. ఒక హీరో స్టార్ అవుతున్నారు అంటే సాధారణ జనమే ఉంటారు. వారేదో కట్టెలు కొట్టి, మొద్దులు మోసి ఆ పేరు  సంపాదించుకోరు. ఒక లీడర్ ఎదుగుతున్నాడు అంటే సాధారణ కార్యకర్త ఫ్లెక్సీ కడతాడు, ర్యాలీ చేస్తాడు, చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇలా ఎవరు ఏ విధంగా ఎదిగినా దాని వెనక ఉండేది సాధారణ ప్రజలు మాత్రమే.. ఇలా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆస్తుల పరంగా, పేరుపరంగా, అంతస్తు పరంగా, పెద్దవాళ్లను చేస్తూ చివరికి పేదలు బలైపోయి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మరి ఇంత జరిగినా ఈ బడా వ్యక్తులు, పేదలకు ఏమైనా న్యాయం చేస్తున్నారా అంటే అది లేదు. 

ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజకీయ సినిమా సభలకు సంబంధించి ఏ ర్యాలీ నిర్వహించినా సభలు పెట్టినా  తొక్కిసలాటల్లో ఎంతో మంది మరణించారు.. అయితే తాజాగా తమిళనాడు ఘటనలో  చాలామంది తొక్కిసలాటలో మరణించడంతో దేశవ్యాప్తంగా ఇది సంచలనమైంది. తమిళనాడు హీరో రాజకీయ నాయకుడు విజయ్ కొత్త పార్టీ పెట్టి ఇప్పటికే సభలు సమావేశాలతో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా అయిన 10,000 మందికి పర్మిషన్ తీసుకొని  లక్షలాదిమందితో ర్యాలీ నిర్వహించారు. దీంతో తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది సాధారణ ప్రజలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయాల పాలై చావుతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పొలిటికల్ ఈవెంట్లలో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటి సారి అనుకోవచ్చు.

ఇలా రాజకీయ సభలే కాకుండా మొన్నటికి మొన్న క్రికెట్ కి సంబంధించి ఆర్సిబి కప్పు గెలిచిన ఆనందంలో పరేడ్ ర్యాలీ లో లక్షలాదిమంది పాల్గొని అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. అంతేకాకుండా పుష్ప2 ప్రీమియర్స్ కి సంబంధించి రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా ఆమె కొడుకు తీవ్రంగా గాయాల పాలయ్యారు.. ఇలా ఏ ఈవెంట్ జరిగినా సాధారణ ప్రజల ప్రాణాలు మాత్రం గాల్లో కలవడం తేలికైపోయింది. దీంతో దేశవ్యాప్తంగా చాలా మంది మేధావులు స్పందిస్తూ  మామూలు ప్రజలు అంటే అసలు ఈ నాయకులకు హీరోలకు లెక్కలేదా.. వీళ్లవైనా ప్రాణాలే, వాళ్లవైనా ప్రాణాలే కదా.. నాయకుల యొక్క బలప్రదర్శన చూపించుకోవడానికి ఇలా సభలు పెట్టి పేదల ప్రాణాలు తీస్తూ  వాళ్ళు ఎదుగుతున్నారు..

చివరికి పోలీసులు వైఫల్యం చెందారని దానివల్ల అంత మంది చనిపోయారని వారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.. నిజం చెప్పాలంటే సాధారణ జనాలకు తెలివి ఉండాలి.. ఒక సభకు మనం వెళ్తున్నామంటే మనతోపాటు పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం. చివరికి మీరు అక్కడ ప్రాణాలు కోల్పోతే మీ పిల్లలు ఏమైపోవాలి కుటుంబం ఏమైపోవాలి. ఒక హీరోను లేదా రాజకీయ, నాయకుడిని చూడడానికి అంత ఆత్రం అవసరం లేదు.. మీ ప్రాణాలు పోతే  ఆ హీరో ఆ నాయకుడు వచ్చి మీ కుటుంబాన్ని సాకడు కదా.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సాధారణ జనం ఇంట్లో ఉండడం మంచిదనేది మేధావులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: