పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా ఒకటి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏం రత్నం సమర్పణలు నిర్మితమవుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయక నటిస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విభిన్న తరహా పాత్రలో కనిపించనున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

ఇక ఈ సినిమా సెట్స్ మీదకి చాలా కాలమైంది కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ప్రస్తుత మీ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ బయటికి వచ్చింది.అదేంటంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులాటను సంపాదించుకున్న హైపర్ ఆది ఈ సినిమాలో భాగం అవుతున్నట్లు సమాచారం. హరిహర వీరమల సినిమా కోసం హైపర్ ఆది రైటర్ గా సాయం అందిస్తున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరపై ఓవైపు కమెడియన్ గా సత్తా చాటుతూనే తోనే ఇంకోవైపు కొన్ని సినిమాలకు స్క్రిప్స్ కూడా అందిస్తున్నాడు హైపర్ ఆది.

ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమాలో సైతం హైపర్ ఆది కొన్ని కామెడీ స్కిట్స్ రాయడం జరిగింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి కొన్ని కామెడీ సన్నివేశాల విషయమై హైపర్ ఆది స్క్రిప్ట్ ను చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మాటల రచయిత సాయి మాధవ్ బుర్రతో కలిసి హైపర్ ఆది రైటింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడని సమాచారం. ఇక సినిమాలో ఆది రైటింగ్ కి మంచి మార్కులు పడితే అతని దశ తిరగడం ఖాయమైనట్లే అని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు ఈ సినిమాకి అది పనితనం వర్కౌట్ అయితే అతనికి మరికొన్ని బడా ప్రాజెక్ట్స్ నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.ఇక ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: