
కానీ ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇంకొక వర్గం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో చిరంజీవి ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించాడు. ఇలా మాస్ ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో నచ్చిన చిరంజీవి మిగతా ఆడియన్స్ కొంతవరకు మొదటి భాగంలో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది . రెండవ భాగంలో రవితేజ ఎంట్రీ తర్వాత కథ మొత్తం మారిపోయింది.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి మళ్ళీ ఎదురుచూపు చూస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ ని ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ బాబీ విఫలమయ్యాడు. ఓవర్ ది టాప్ సెకండ్ హాఫ్ మరియు జీరో ఎమోషనల్ కనెక్ట్ తో పేలవమైన క్లైమాక్స్ .. భారీ స్టార్ తారాగణం ఉన్నప్పటికీ ఎవరికి గుర్తింపునివ్వలేదు. అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సరికొత్త డైరెక్టర్ తో అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని చిరంజీవి ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మరి ఈసారైనా ఆయన పలు జాగ్రత్తలు తీసుకొని తన తదుపరిచిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తారని అభిమానులు కోరుకుంటున్నారు.