సిడెడ్ ఏరియా లో ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

వినయ విధేయ రామ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వినయ విధేయ రామ సినిమా సీడెడ్ ఏరియాలో మొదటి రోజు 7.5 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత స్థానంలో నిలిచింది.


వీర సింహా రెడ్డి : బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 6.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.


బాహుబలి 2 : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా రూపొందిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో మొదటి రోజు 6.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.


సైరా నరసింహా రెడ్డి : మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో నయనతార ... తమన్నా హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ సీడెడ్ ఏరియాలో మొదటి రోజు 5.91 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.


అరవింద సమేత : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 5.48 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: