సినిమాల ద్వారా పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత కొన్నాళ్లపాటు ప్రేమలో కొనసాగి ఇక పెళ్లితో తమ ప్రేమకు ప్రమోషన్ ఇచ్చిన జంటలు బాలీవుడ్లో చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలా ప్రేమ పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లలో అందరికీ మోస్ట్ ఫేవరెట్ గా కొనసాగుతూ ఉంటారు కాజోల్, అజయ్ దేవగన్ జంట. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు అప్పట్లో సూపర్ హిట్ సాధించడంతో ప్రేక్షకులకు ఫేవరెట్ జోడీగా మారిపోయింది ఈ జంట. ఇక తర్వాత కాలంలో వీరిద్దరూ ప్రేమలో పడటం పెళ్ళి చేసుకోవడం కూడా జరిగింది.


 అయితే అప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన కాజోల్ పెళ్లి తర్వాత మాత్రం సినిమాలను తగ్గించేసింది. కేవలం వాణిజ్య ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తూ ప్రేక్షకులను అలరించింది అని చెప్పాలి. అయితే 2022లో మళ్ళీ కాజోల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. త్రిబంగ అనే చిత్రంతో డిజిటల్ రంగ ప్రవేశం చేసింది.. ఇక ఆ తర్వాత హిట్ షో 'ది గుడ్ వైఫ్' హిందీ రీమేక్ కీ సైన్ చేసింది. ఇటీవల ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ కాగా.. ప్రమోషన్స్ మొదలయ్యాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సిరీస్లో కాజోల్ కి జోడిగా నటించిన బ్రిటిష్ పాకిస్తానీ నటుడు అలి ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 కాజోల్ తో తాను రొమాంటిక్ సీన్స్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. కాజోల్ తన అభిమాన హీరోయిన్ అని ఎప్పటికైనా ఆమెతో నటించాలని కోరుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ అవకాశం వచ్చిందణి తెలిపాడు. తన క్రష్ తో రొమాంటిక్ సీన్స్ లో  నటించాను.. అది కూడా లిప్ కిస్ పెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు. ముంబైలోని ఒక స్టార్ హోటల్లో ఈ కిస్ సీన్ షూట్ చేశారు. అయితే అప్పుడు కాజోల్ భర్త అజయ్ షూట్ కి రాలేదు. దీంతో అంతకుముందు రెండు మూడు సార్లు కిస్ సీన్ ప్రాక్టీస్ చేసి... ఇక షూటింగ్లో కేవలం రెండు సెకండ్స్ లో ఇది పూర్తి చేశాం. ఇక అప్పుడు కాజోల్ థాంక్యూ డార్లింగ్ అంటూ మెచ్చుకుంది అంటూ గుర్తు చేశాడు బ్రిటిష్ పాకిస్తానీ నటుడు అలీ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: