ఎప్పుడు వార్తల్లో  నిలిచే వర్మ తాను ఏం మాట్లాడినా కూడా అవతలి వారు ఫీల్ అవుతారు అని ఏమాత్రం అయితే అనుకోడు. ఎవరు ఏమనుకున్నా సరే చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేస్తాడు..

సంచలనాలకు మాత్రమే కాదు సంచలనం వ్యాఖ్యలకు అలాగే కాంట్రవర్సీ డైలాగులకు ఆయన పెట్టింది పేరు. కేవలం మాటలు మాత్రమే కాదు తనకు నచ్చిన పని చేయడంలో కూడా వర్మ ఎప్పుడూ కూడా ముందుంటాడు.

ఇక తన నిజ జీవితంలో మాత్రం ఎవరి  ప్రేమలో అయినా పడ్డాడు ? సినీ దేవత శ్రీదేవి ని మాత్రమే పిచ్చిపిచ్చిగా ప్రేమించాడా ? ఎవరిపై అభిమానంతో ఆ సినిమా తీశాడు ? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం .చాలా ఏళ్ల నుంచి ఈ వర్మ శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమెను ఎంతగానో ప్రేమించానని, కానీ ఆమె మాత్రం బోనీకపూర్ నీ పెళ్లి చేసుకుందని, అతడు నా పాలిట విలన్ అంటూ కూడా నూటికి ఏది వస్తే అది మీడియా ఇంటర్వ్యూ లలో మాట్లాడుతూ ఉంటాడు.

అయితే వర్మ శ్రీదేవితో పాటు కొన్నాళ్లపాటు ఊర్మిలను కూడా అలానే ప్రేమించాడట. అంతేకాదు ఆమెతో కొన్నాళ్ళ పాటు కూడా ఇలానే నడిపించాడట. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ కన్నా ముందు సత్య అనే అమ్మాయితో కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్నాడని సమాచారం.. వర్మ ఆమెపై ఇష్టంతోనే తాను తీసిన ఒక సినిమాకు సత్య అనే పేరు ను పెట్టుకున్నాడట.ఊర్మిళ మరియు నాగార్జున కాంబినేషన్లో అంతం అనే ఒక సినిమా తీశాడు వర్మ అది దారుణంగా ప్లాప్ అయ్యింది. అయితే ఊర్మిలపై ఇష్టంతో అలాగే తన లవర్ పేరు పెట్టి ఒక స్టోరీని కాస్త అటు ఇటు తిప్పి సత్య అంటూ ఆ సినిమా ను తీశాడు. ఆ సినిమా బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. ఒకవేళ అంతం సినిమా హిట్ అయి ఉంటే కనుక సత్య సినిమా తీసే వాడిని కాదు అంటూ వర్మ ఒక ఇంటర్వ్యూలో తెలపడం గమనార్హం.. అలా వర్మ తన ప్రియురాళ్లపైన, అలాగే ప్రేమించిన వారి పైన ఇష్టంతో ఇలా సినిమాలు కూడా తీస్తూ ఉంటాడటా.. అయినా అక్కడ ఉన్నది వర్మ కదా ఆయన ఏం చేసినా కానీ అది ఒక సంచలనమే.

మరింత సమాచారం తెలుసుకోండి: