మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించి ప్రపంచవ్యాప్తంగా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం రామ్ చరణ్ ,  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే మూవీలో హీరోగా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను కూడా ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి ఎన్నో అవార్డులు రివార్డులు ప్రపంచవ్యాప్తంగా దక్కడంతో ప్రస్తుతం ఈ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది.

ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నాడు. కియర అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా , సునీల్ , అంజలి ఇతర ముఖ్యపాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి అనేక షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ తదుపరి షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో విశాఖపట్నంలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. విశాఖ పట్టణం లో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే ఈ మూవీ షెడ్యూల్లో చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ కి ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ  మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: