నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం వరుస పరాజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తిరిగి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . అలా అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా , అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా ఇప్పటికే రెండు వరస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే అనిల్ రావిపూడిమూవీ లో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడనున్నట్లు ప్రకటించాడు.

దానితో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి అదిరిపోయే రేంజ్ కాస్ట్ అండ్ క్రూ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ కు కూతురు పాత్రలో శ్రీ లీలా కనిపించబోతున్నట్లు , ఈ మూవీ కి తమన్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: