టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో అందమైన ప్రేమ కథల రూపంలో సినిమాలు వచ్చాయి. కానీ ఎప్పటికీ చెప్పుకునే సినిమా పేరు అయితే కొత్త బంగారులోకం అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు. టాలీవుడ్ సెన్సిబిలి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎవరు ఊహించిన విధంగా మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఈ సినిమాలో హీరోగా వరుణ్ సందేశ్ హీరోయిన్గా శ్వేతా బసు నటించి అందరినీ ఆకట్టుకున్నారు. టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా మంచి విజయాన్ని సైతం అందుకుంది. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పటికి ఈ సినిమా వస్తే టీవీలకే అతుక్కుపోయి ఈ సినిమాను చూస్తూ ఉంటారు. 

అంతేకాదు ఈ సినిమాలోని పాటలను ఇప్పటికీ చాలామంది ఎంతో ఉత్సాహంతో వింటూ ఉంటారు. ఈ సంగీతం ఇప్పటికీ చాలామంది శ్రోతలను అలరిస్తోంది. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక అదేంటండి అంటే.. ఈ సినిమాలో హీరోగా ముందుగా వరుణ్ సందేశం అనుకోలేదట.  ముందుగా ఈ సినిమాలో హీరోగా ఎవరిని అనుకున్నారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.. వరుణ్ సందేశ్ మరియు శ్వేతా బసు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ముందుగా హీరోగా అక్కినేని హీరో నాగచైతన్య ని అనుకుంటున్నారట. అయితే ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు మరియు నిర్మాతలు నాగార్జునకి వినిపించారట.

దీంతో నాగార్జున మాట్లాడుతూ నాగచైతన్యను మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో లాంచ్ చేయాలన్నట్లుగా ఆదర్శక నిర్మాతలతో చెప్పాడు. అంతేకాదు మాస్ స్టోరీ ఉంటేనే మీ బ్యానర్లో చేస్తామని నాగార్జున చెప్పుకొచ్చాడట. దాని అనంతరం ఈ సినిమాలో హీరోగా ఎవరిని తీసుకోవాలి అని అనుకుంటున్న సమయంలో.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పెరకెక్కిన హ్యాపీడేస్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన వరుణ్ సందేశ్ ని చూసి వరుణ్ని చూసి..వరుణ్ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతాడని దిల్ రాజు భావించాడట. దిల్ రాజా భావించినందుకు గాను ఈ సినిమాలో హీరోగా వరుణ్ సందేశం ఎంపిక చేశారట. అలా ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాతో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్.ఈ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమా నిరాశపర్చిన సంగతి మనందరికీ తెలిసిందే ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: