ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ‘ఖైదీనెంబర్‌ 150’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమా తర్వాత చిరుకు ఆ రేంజ్ హిట్  లేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘సైరా’ పక్క రాష్ట్రాలలో ప్లాప్ అయిన తెలుగులో పర్వాలేదనిపించే కలెక్షన్‌లతో నిలిచింది. ఇక ‘ఆచార్య’ సినిమా చిరు కెరీర్ కే మాయని మచ్చలా మిగిలింది. కనీసం ఈ సినిమా బడ్జెట్‌లో పావు వంతు కలెక్షన్‌లు కూడా వసూలు చేయలేకపోయింది. దసరా పండుగ కానుకగా విడుదలైన ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా కూడా అంతే. మొదటి రోజు పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకున్నా అప్పటికే ఎంతో మంది చూసేసిన ‘లూసీఫర్‌’కు ఈ సినిమా రీమేక్‌గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై అంతగా ఆసక్తి కనబరచలేదు. దాంతో ఈ సినిమా కమర్షియల్ గా బిగ్గెస్ట్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ముఖ్యంగా ఆచార్య, గాడ్‌ఫాదర్‌ ఫలితాలతో చిరు మార్కెట్‌ అయితే చాలా వరకు దెబ్బతినిందనే చెప్పాలి.అయితే వాల్తేరు వీరయ్య సినిమాతో విమర్శలు చేసిన వారితోనే ప్రశంసలు దక్కించుకున్నాడు.  సంక్రాంతి పండుగ కానుకగా రిలీజైన ఈ సినిమా తొలిరోజు మాత్రం పెద్దగా పాజిటీవ్‌ టాక్‌ అయితే ఏమి తెచ్చుకోలేదు. కానీ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ఇదే కాస్త బెటర్‌గా ఉండటంతో ఈ సినిమాకి ఎక్కడ లేని క్రేజ్‌ వచ్చింది.


పైగా సంక్రాంతి సీజన్‌ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ వాల్తేరు వీరయ్యను చూడడానికి థియేటర్‌లకు క్యూ కట్టారు. అయితే ఈ సినిమా చిరుకి లాటరీ అనే చెప్పాలి.బాలయ్య ' వీరసింహారెడ్డి' పెద్దగా ఆకట్టుకోలేక ఇంకా ఏ సినిమా లేక జనాలు ఈ సినిమాని చూశారు.అయితే చిరు రేంజ్‌ ఏంటో తెలియాలంటే ‘భోళా శంకర్‌’ సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాపై ఇప్పటి దాకా ఎలాంటి బజ్‌ లేదు. పైగా మూవీ టీం రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇవన్నీ పక్కన పెడితో ఈ మధ్య కాలంలో రీమేక్‌ సినిమాలను ప్రేక్షకులు ఊదేస్తున్నారు. అందులోనూ అసలు తెలుగులో అసలు మినిమమ్ హిట్టేలేని మెహర్‌రమేష్‌ ఈ సినిమా బాధ్యతలు తీసుకోవడంతో మెగా ఫ్యాన్స్ కూడా భోళాశంకర్‌పై ఇంట్రెస్ట్‌ చూపడంలేదు. మరి ‘వాల్తేరు వీరయ్య’సినిమాతో గ్రాండ్‌ కంబ్యాక్‌ ఇచ్చిన చిరు అదే ఊపుతో భోళా శంకర్‌తో తన స్టైల్‌ కామెడీ ఇంకా చరీష్మాతో ఆకట్టుకుంటాడో లేదో చూడాలి. వేసవిలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్న ఈ సినిమా సక్సెస్‌ను బట్టి మెగాస్టార్ రేంజ్‌ ఏంటో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: