బ్రోచేవారెవరురా క్రేజీ కామెడీ కాంబినేషన్‌ రిపీట్?

టాలీవుడ్ యంగ్ అండ్  టాలెంటెడ్‌ డైరెక్టర్లలో ఖచ్చితంగా వివేక్‌ ఆత్రేయ కూడా ఒకడు. ఈ దర్శకుడి  నుంచి చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన చిత్రం బ్రోచేవారెవరురా. మంచి క్రైం కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీవిష్ణు, ప్రియదర్శి ఇంకా అలాగే రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించగా.. సత్యదేవ్‌, నివేదా థామస్‌ ఇంకా నివేదా పేతురాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాలో లీడ్‌ రోల్స్‌ పోషించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి ఇంకా అలాగే రాహుల్‌ రామకృష్ణ కలిసి మరో సినిమా చేస్తున్నారని తాజా వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్‌లో వైరల్ అవుతూ రౌండప్ చేస్తోంది.తాజాగా తెలుస్తున్న అప్‌డేట్ ప్రకారం హుషారు సినిమా దర్శకుడు హర్ష కొనుగంటి  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైనట్టు సమాచారం తెలుస్తుంది. ఇంకా టైటిల్‌ ఫిక్స్ కాని ఈ సినిమా తరువాతి షెడ్యూల్‌ కేరళలో షురూ కానుంది. 


ఇంకా ఈ షెడ్యూల్‌తో సినిమా షూట్ మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు కనిపించబోతున్నారు.. ఇంతకీ ఈ సారి ఎలాంటి జోనర్‌లో సినిమా రాబోతుందనేది మాత్రం ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్ నెలకొంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.యూవీ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి విలక్షణ మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ ఎంఆర్‌ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. కథాబలమున్న సినిమాలను చేసే యాక్టర్లలో ఎప్పుడూ ముందుంటాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఇక ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కామెడీ టైమింగ్‌ గురించి అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా రాబోతుందనే అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు సినిమా అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: