నందమూరి హీరో తారకరత్న గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురైన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. తారకరత్న కి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు సుమారు 45 నిమిషాల పాటు ఆయన గుండె ఆగిపోయిందని, అప్పుడు రక్తప్రసరణ ఆగిపోవడంతో ఆయన బ్రెయిన్ ఇప్పుడు సరిగా పనిచేయడం లేదని మెదడు పైభాగం కొంతమేర దెబ్బతిని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. అంతేకాదు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా ఇటీవల వార్తలు వినిపించడం జరిగింది. 

అయితే తాజాగా తారకరత్న హెల్త్ గురించి స్పందించారు నందమూరి కళ్యాణ్ రామ్. అతను హీరోగా నటించిన 'అమిగోస్' సినిమా ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు కళ్యాణ్ రామ్. దాంట్లో  భాగంగా మీడియా ప్రతినిధులు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ప్రశ్నించారు. ఈ మేరకు కళ్యాణ్ రామ్ స్పందిస్తూ..' తన సోదరుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి మెరుగ్గానే ఉందని.. అయితే ఇంకా పూర్తి వివరాలు మాత్రం డాక్టర్లు మాత్రమే అందించగలరని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుందని ప్రస్తుతానికి అతని పరిస్థితి ఎలా ఉందనేది డాక్టర్స్ మాత్రమే చెప్పగలరని అన్నాడు.

ఇక తాను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని మాలో ఒకడిగా కలిసి నడవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నారని తాజా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు కళ్యాణ్ రామ్. ఇక్కడ నందమూరి అభిమానులు కూడా తారకరత్న అతి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా విషయానికొస్తే.. రాజేంద్రనాథ్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కన్నడ భామ ఆశిక రంగనాథ్ హీరోయిన్గా నటించింది. తెలుగులో మొదటిసారి కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రలో నటించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ లభించింది. అటు చిత్ర యూనిట్ కూడా సినిమా విజయంపై ధీమాగా ఉన్నారు. మరి రేపు అనగా ఫిబ్రవరి 10న విడుదలవుతున్న అమిగోస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: