
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక వైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు అంటూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలకు సిద్ధం కాబోతున్నాయి. అందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమా నుంచి తాజాగా విడుదల చేసిన అప్డేట్ అభిమానులను నిరాశకు గురి చేసింది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ బజ్ ఏర్పడింది..
నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయినట్లే.. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ రెండు పాత్రలలో నటించబోతున్నాడు. పునర్జన్మల నేపథ్యంలో సాగే కథగా ఇది ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలో ఉండగా హరిహర వీరమల్లు మూవీ ని ఏప్రిల్ లో తెలుగు, తమిళ్, కన్నడ ,హిందీ , మలయాళం లో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నహాలు చేశారు. కానీ ఈ సినిమా షూటింగు విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయిన తర్వాతనే టీజర్ను విడుదల చేస్తారట. అంతేకాదు ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ దీంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.