ఇటీవల కాలంలో ఎంతో మంది యువ దర్శకులు తమలో ఉన్న టాలెంట్లు నిరూపించుకునేందుకు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ హిట్ లు అందుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేవలం చిన్న సినిమాగా వచ్చిన మూవీస్ సైతం బ్లాక్ బాస్టర్ విజయం సొంతం చేసుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇలా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇక అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ సాధించిన సినిమా సీతారామం. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హాట్ బ్యూటీ మృనాల్  ఠాగూర్ నటించిన ఈ సినిమా అందరిని ప్రేమ అనే మత్తులో మునిగి తేలేలా చేసింది అని చెప్పాలి.


 ప్రేమ గొప్పతనం ఏంటి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చెప్పింది ఈ సినిమా. మాస్ ఆడియన్స్ దగ్గర నుంచి ఫామిలీ ఆడియన్స్ వరకు అందరికీ కనెక్ట్ అయింది అని చెప్పాలి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను తెరకెక్కించిన  హాను రాఘవపూడి కూడా ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ రేస్ లోకి వచ్చేసాడు. అయితే ఒక సినిమా హిట్ అయింది అంటే ఇక దర్శకుడు ఎవరితో మరో సినిమా చేయబోతున్నాడు అన్నది ఎప్పుడు హాట్ టాపిక్ అనే మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.



 ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. సీతారామంతో హిట్టు కొట్టిన హను రాగవపూడి నాచురల్ స్టార్ నానితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. అయితే దీనిపై ఇప్పటివరకు మాత్రం అఫీషియల్ ప్రకటన రాలేదు అని చెప్పాలి.  ఇక తన ట్విట్టర్ వేదికగా మాత్రం ప్రొఫైల్ పిక్చర్ మార్చి ఇక చాలామందికి దీనిపై హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా నాని హను రాగవపూడి కాంబినేషన్లో గతంలో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమా వచ్చింది. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది.మరి ఇప్పుడు ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: