సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని గత 20 సంవత్సరాలుగా అదే క్రేజీతో దూసుకుపోతున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో అందంతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ వివాహం అనంతరం కూడా మరింత పాపులారిటీని దక్కించుకుంది. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలోని అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ కూడా ఈమె కావడం గమనార్హం. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నటించి సక్సెస్ పొందిన ఈమె ఇటీవల అజిత్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  అందులో నయనతార భర్త విగ్నేష్ శివన్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.. కానీ ఉన్నట్టుండి అజిత్సినిమా డైరెక్షన్లో మార్పులు చేయాలి అని విఘ్నేష్ శివన్ ను కోరగా ఆయన నిరాకరించడంతో ఆయనను సినిమా నుంచి తప్పించినట్లు అధికారికంగా కూడా స్పష్టం చేశారు.  దీంతో తన భర్తను అవమానించిన అజిత్ సినిమాలో ఇకపై నటించకూడదని నిర్ణయం తీసుకొని ఆ సినిమాలో తాను కూడా నటించనని చెప్పేసిందట నయనతార.


అంతేకాదు ఇక భవిష్యత్తులో కూడా తాను సినీ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు అజిత్ తో సినిమాలు చేయను అని ఆమె నిర్ణయం తీసుకుందని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.  ఇకపోతే అజిత్ ఇటీవల తెగింపు సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్టుపై అందరి అంచనాలు నెలకొన్నాయి.  అలాంటి సమయంలో నయనతార తప్పుకోవడంతో అభిమానులు నిరాశ పడ్డప్పటికీ ఇప్పుడు  ఆ  స్థానంలో సాయి పల్లవి వచ్చినట్టు సమాచారం.  ఆమె కూడా కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.  కానీ మొత్తానికైతే అజిత్ వంటి స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి నటించే అవకాశాలు దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: