టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫ్యాన్స్ కు నిత్యం టచ్ లో ఉంటూ తన వ్యక్తిగత విషయాలకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది కాజల్. మొదటి లాక్ డౌన్ లో కాజల్ అగర్వాల్ కి పెళ్లయింది. 2021 అక్టోబర్ 30న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్. తన హోమ్ టౌన్ ముంబైలో కుటుంబ సభ్యులు మరియు చాలా తక్కువ మంది అతిధుల మధ్య వీరిద్దరి వివాహం జరిగింది. దాని అనంతరం కొద్ది నెలలకి ప్రెగ్నెంట్ అంటూ షాక్ ఇచ్చింది కాజల్. 

ఏప్రిల్ 19న 2022న 12 మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లి ప్రెగ్నెన్సీ తో సినిమాలకు దూరమైంది కాజల్. ప్రస్తుతం తన కొడుకు కుటుంబ సభ్యులతోనే గడుపుతోంది కాజల్. కొడుకు జన్మించిన తర్వాత తన బిడ్డను చూసుకుంటూ బిజీగా మారింది కాజల్. ఈ క్రమంలోనే తాజాగా కాజల్ తన కొడుకుకి సంబంధించిన మరొక క్యూటెస్ట్ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో ఒక రొమాంటిక్ ఫోటోను షేర్ చేసింది కాజల్. ఈ క్రమంలోని తన కొడుకుతో కలిసి దిగిన ఒక ఫోటోను కూడా తన అభిమానులతో పంచుకుంది. ఇందులో భాగంగానే కాజల్ ఒక క్యాప్షన్ కూడా జోడించింది.. 

ఎప్పటికీ సూర్యుడులా వెలిగిపోతూనే ఉండే వాడు నా కొడుకు నీల్ కిచ్లు నాకు చాలా విలువైనవాడు వాలెంటైన్లు ఇంకా అయిపోలేదు నీల్ కిచ్లు నాకు ప్రేమ తాలూకా అర్ధాన్ని ప్రతిరోజు బోధిస్తూనే ఉన్నాడు అంటూ తన తల్లి ప్రేమను ఎంతో గొప్పగా చాటుకుంది కాజల్. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా తన సోషల్ మీడియా వేదికగా ఒక క్యూట్ ఫోటోను తన అభిమానులతో షేర్ సిహేయడంతో ఈ ఫోటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫోటోను చూసిన చాలామంది నీల్ లో మరియు కాజల్ ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉండాలి అంటూ పేర్కొంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: