సాధారణంగా ఏ హీరో ,హీరోయిన్ల కైనా లేదా డైరెక్టర్లకైనా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే వారి జాతకాలే మారిపోతూ ఉంటాయి. అప్పటివరకు వారి వెంట ఉన్న ప్రతి ఒక్కరూ వారి సినిమా ఫ్లాప్ కావడంతో ముఖాలు చాటేస్తూ ఉంటారు. ఫోన్లు చేసినా కూడా పట్టించుకోరు. కానీ హిట్టు పడితే మాత్రం ఆ హీరో హీరోయిన్లని లేదా డైరెక్టర్ లని అస్సలు వదలరు. అయితే ప్రస్తుతం ఇదే పరిస్థితి పూరి జగన్నాథ్ కి ఎదురయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన దర్శకత్వం వహించిన లైగర్ సినిమా ఎంతటి డిజాస్టర్ ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకి విజయ్ దేవరకొండ తో పాటు పూరి జగన్నాథ్ కి కూడా ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది అని చెప్పాలి.

 దీంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ బాట పట్టాలని చూస్తున్నాడు పూరి జగన్నాథ్. అందుకోసం భారీ ఎత్తున ప్లాన్లు కూడా మొదలు పెట్టాడు. ఇప్పటికే హిందీలో సినిమా చేయాలని బాలీవుడ్ లో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు పూరి జగన్నాథ్. అయినప్పటికీ ఆ ప్లాన్లు ఏవి కూడా వర్క్ అవుట్ అవ్వడం లేదు. దీంతో ఏదిక్కు లేక మళ్ళీ టాలీవుడ్ లోనే అవకాశాల కోసం చూస్తున్నాడు పూరి జగన్నాథ్.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ ని సంప్రదించాడట. అంతేకాదు ఇద్దరు హీరోలని ఒకేసారి లైన్ లు వినిపించారట పూరి జగన్నాథ్.అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవితో పూరి ఆటో జానీ అనే సినిమాని చేయాలని అనుకున్నాడు. కానీ చిరంజీవికి ఆ కథ ఏమాత్రం నచ్చలేదు.

ఈ క్రమంలోనే మరో మంచి కథతో వస్తే అవకాశం ఇస్తానని పూరికి చిరు చెప్పడంతో మరో మంచి కథతో చిరంజీవిని సంప్రదించాడట పూరి. ఈ క్రమంలోనే ఈ సినిమా చేయాలంటే పూరికి కొన్ని కండిషన్స్ పెట్టాడట మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సంక్రాంతికి విడుదలైన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లను కూడా రాబట్టింది. ఈ క్రమంలోని మరో మాస్ మసాలా యాక్షన్ సినిమాని తీయాలని భావించిన పూరి మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక పవర్ఫుల్ కదని రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం మెగాస్టార్ చిరంజీవి కొన్ని కండిషన్లు పెట్టాడట. 30 రోజుల్లోనే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో రావాలని.. షూటింగ్ కి కేవలం 30 రోజులు మాత్రమే కేటాయిస్తానని.. కండిషన్లు పెట్టడం మెగాస్టార్ చిరంజీవి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: