మొన్నటివరకు ఆలీతో సరదాగా అనే సెలబ్రిటీ టాక్ షో చేసి భారీ పాపులారిటీ దక్కించుకొని.. బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైన అలీ ఇటీవల ఏపీ రాజకీయాలలో కూడా బిజీగా మారారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ మీడియా అధినేతగా పదవి పొందిన ఈయన అటు రాజకీయాలలో కూడా మరింత చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అలీకి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకెళితే కమెడియన్ ఆలీకి నత్తి ఉందట ఆయన మాట్లాడే సమయంలో అప్పుడప్పుడు అది బయటకి వస్తుందని కానీ తన నత్తి బయటకు రాకుండా ఆయన జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
తనకున్న వైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా తనలో తాను సతమతమవుతూ ఎదుటివారికి నవ్వును పంచడంలో ఆలీ సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు. మొత్తానికైతే అలీ అలాంటి వైకల్యంతో బాధపడుతున్నప్పటికీ ఏ రోజు కూడా తనకు ఈ సమస్య ఉంది అని ఎవరి దగ్గర ఆయన చెప్పుకోలేదు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఆయన డెడికేషన్ కు ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మొత్తానికైతే ఆలీ మళ్ళీ ఇప్పుడు సినిమాలలో చురుగ్గా పాల్గొంటూ సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.