టాలీవుడ్ స్టార్ ఎస్.ఎస్.రాజమౌళిని దారుణంగా అవమానిస్తూ ఫేమస్ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్  రాసిన ఓ ఆర్టికల్ ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. ''ది మ్యాన్ బిహైండ్ ఇండియాస్ కాంట్రవర్శియల్ గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRR' అనే టైటిల్ తో 'ది న్యూయార్క్' న్యూస్ పేపర్ సెన్సేషనల్ ఆర్టికల్ ని పబ్లిష్ చేసింది.అయితే ఈ ఆర్టికల్ చదివిన కంగన సూటిగా ఆ పత్రికపై కౌంటర్ అటాక్ చేసింది. ఈ ఆర్టికల్ చదివినప్పుడు తాను స్థైర్యాన్ని కోల్పోలేదని రాజమౌళి దీనిని పట్టించుకోరని కూడా కంగన అన్నారు. భారతదేశ కీర్తి పతాకను ప్రపంచ సినీయవనికపై ఆవిష్కరించి వెలుగులు విరజిమ్మేందుకు కారకుడైన ప్రాంతీయ దర్శకుడు రాజమౌళిపై ఇలా ఈ రకంగా బురద జల్లడం సరికాదని పేర్కొంది.


ఇక తన ట్విట్టర్ ఖాతాలో రాజమౌళిని వివాదాస్పదుడిగా ప్రపంచం దృష్టిలో 'ముద్ర' వేయాలన్న సదరు గ్లోబల్ పత్రిక ఆర్టికల్ ని చాలా తీవ్రంగా వ్యతిరేకించిన కంగన.. ఆ ప్రయత్నాన్ని తప్పు బట్టింది . ''ఏం వివాదాలు సృష్టించారు రాజమౌళి? పోయిన మన(భారతీయ) సినిమా ఘనతను ప్రపంచం కీర్తించడానికే 'బాహుబలి' అనే కళా ఖండాన్ని తీశారు రాజమౌళి.. అని కంగన ఒక రేంజిలో ప్రశంసించారు.ఇక రాజమౌళి 'వ్యక్తిగతంగా చిత్తశుద్ధి' కలిగినవారు.. ఆ పత్రిక దీనిని ప్రశ్నార్థకం చేసిందని కంగన కలత చెందారు. ''రాజమౌళి ఈ దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు.. అతను ప్రాంతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. ఆయన ఏ వివాదానికి కారకుడో నాకు తెలుసు. ఆయన భారత దేశం పట్ల అంకితభావం కలిగి ఉన్నాడు." అని ట్వీట్ చేసి రాజమౌళిని ఆకాశనికి ఎత్తేసి ఆ పత్రికపై ఒక రేంజిలో కౌంటర్ ఎటాక్ చేసింది. ప్రస్తుతం ఈమె ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో ఫుల్ బిజీగా వున్నాడు. ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజిలో ఆయన తెరకెక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: