ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఏదో ఒక కొత్త కార్యక్రమం వెలుగులోకి వస్తు బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా సందడి చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇక ఇలా వచ్చిన కొత్త కార్యక్రమాలకు టిఆర్పి రేటింగ్ పెంచుకునేందుకు ఇక ఎన్నో చిత్ర విచిత్రమైన పనులు కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే అక్కడ చేసేది టిఆర్పి స్టంట్ అని ప్రేక్షకులకు తెలుసు. అయినప్పటికీ ఎందుకో షో నిర్వాహకులు మాత్రం రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు.


 ఇప్పటికే అన్ని ఛానల్స్ లో ఎన్నో రకాల కార్యక్రమాలు అటు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి. ఇవన్నీ సరిపోవు అన్నట్లుగా ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లుగా వెళ్లి సందడి చేసిన వారిని బేబి జోడి అనే కార్యక్రమంతో మళ్లీ ప్రేక్షకులను అలరించేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు అందరూ కూడా జోడీలుగా ఏర్పడి తమ డాన్స్ పెర్ఫార్మన్స్ లతో బీబీ జోడీలో అదరగొడుతున్నారు. ఇకపోతే ఇంటీవలే ఇందుకు సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒక సరికొత్త థిమ్ తో ఇటీవలే ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కూడా తమ డాన్స్ పెర్ఫార్మన్స్ చేశారని తెలుస్తుంది. ఇక ఎప్పటిలాగానే ఈ ప్రోమోలో మెహబూబ్, సత్య రెచ్చిపోయారు. ముద్దులతో నానా హంగామా చేశారు. ఇక అదే సమయంలో అవినాష్ ఏకంగా ట్రాన్స్ జెండర్ల గురించి ఒక పర్ఫామెన్స్ చేశాడు. సభ్య సమాజంలో ట్రాన్స్ జెండర్లు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాళ్లని అందరూ ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్న పర్ఫామెన్స్ చేయగా ఇది చూసి జడ్జిగా ఉన్న సదా ఫిదా అయిపోయింది. ఈ క్రమంలోనే స్టేజి మీదకి వెళ్లి అవినాష్ కాళ్లు పట్టుకోబోయింది. ఇక తర్వాత కన్నీళ్లు పెట్టుకుంది సదా.

మరింత సమాచారం తెలుసుకోండి: