
అయితే ఎట్టకేలకు అజిత్ సరసన కోలీవుడ్ తలైవి త్రిష అవకాశాన్ని దక్కించుకుంది. అయితే సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు మరొకవైపు లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు నెట్ఫ్లిక్స్ ఓటిటి డీల్స్ కూడా అయిపోయినట్లు తెలుస్తోంది. సినిమా అనౌన్స్మెంట్ కు ముందే అజిత్ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం ఇకపోతే అజిత్ నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోని 62వ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలతో పాటు సినిమా టైటిల్ ని కూడా అదే రోజు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
తునివు సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అజిత్ ఇప్పుడు తన 62వ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకోబోతున్నాడు అనేది అభిమానులలో ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే ఆయన ఇప్పుడు ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుండడం చూసి అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ ఇప్పుడు పూర్వ వైభవాన్ని పొందడంలో సక్సెస్ అవుతున్నారని చెప్పవచ్చు.