
ఎన్టీయార్ ని ప్లాప్ ల నుంచి బయటికి తీసుకువచ్చిన టెంపర్ సినిమాకు కథను అందించింది వక్కంతం వంశీ. పూరి తన సినిమాలకి తనే కథలు రాసుకుంటారు అలా కాదని ఎన్టీయార్ వక్కంతం వంశీ దగ్గర ఉన్న కథని పూరికి ఇప్పించి మరి ఈ టెంపర్ సినిమాని చేసారట..అయితే కథ వంశీ దే అయినప్పటికీ దాంట్లో కొన్ని మార్పులు చేసారట పూరి.
ఇక ఇది ఇలా ఉంటె ఈ సినిమా క్లైమాక్స్ విషయం లో ఏం చేద్దాం అని పూరి వంశీ ఇద్దరు కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత కోర్ట్ సీన్ లో సీడీ మిస్ అవుతుంది రౌడీలని నిర్దోషులని కోర్ట్ తీర్పు ఇస్తుంది వాళ్ళు బయటికి వచ్చాక హీరో ఫైట్ చేసి వాళ్ళని చంపేస్తాడు ఇలా తీద్దాం అని పూరి చెప్పాడట.అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఎందుకో అది వంశీ కి నచ్చలేదట.
రాత్రంతా కూర్చొని మరీ ఆలోచిస్తే వంశీ కి ఒక ఆలోచన వచ్చిందట హీరో కూడా రేప్ చేసానని కోర్ట్ లో లొంగిపోతాడు చివర్లో మళ్లీ హీరో కి కేసు కి ఎలాంటి సంబంధం లేదు అని తెలుస్తుంది.దాంతో జైలు లోనే ఫైట్ అనేది చేద్దాం అని పూరికి చెప్పుకొచ్చాడట.దాంతో పూరి లేచి వంశీ ని హాగ్ చేసుకొని ఇది చాలా సూపర్ గా ఉంది ఇలాగే చేద్దాం అని చెప్పారట.