
గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఇప్పుడు రాబోయే సినిమాతో ఎలాగైనా సరే విజయాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే కథ కూడా ఓకే అవడంతో త్వరలో షూటింగ్ కూడా మొదలు కానుంది.. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ ను ఎవరిని తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మిస్ ఇండియా 2020 మానస వారనాసిని ఇందులో హీరోయిన్గా ఫైనల్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ నాగార్జున సరసన మానస నటించనుంది అని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాను శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నారు. రవితేజ తో బంపర్ హిట్టు కొట్టిన ప్రసన్న నాగార్జునతో ఒక రీమేక్ సినిమాను చేయబోతున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మలయాళం లో సూపర్ హిట్ అయినా పోరింజు మరియుమ్ జోష్ మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది . మలయాళం లో జోజు జార్జి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా పలు మార్పులు చేర్పులు చేసి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రసన్నకుమార్ తెరకెక్కించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.