టాలీవుడ్ టాప్ హీరోస్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఇక వీళ్ళ తరువాత నాని, రామ్,నాగ చైతన్య,శర్వానంద్, విజయ్ దేవరకొండ, నితిన్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కొనసాగుతున్నారు. అయితే ఈ యంగ్ హీరోస్ కూడా కొన్ని హిట్ సినిమాలని మిస్ చేసుకున్నారు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..న్యాచురల్ స్టార్ నాని రాజారాణి ఇంకా f2 వంటి హిట్ సినిమాలని మిస్ చేసుకున్నాడు. ఆ సినిమాలు నాని చేసుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యుండేవి. అలాగే అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త బంగారు లోకం లాంటి బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నాడు.


లెక్క ప్రకారం నాగ చైతన్య ఈ సినిమాతో హీరోగా లాంచ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు.అలాగే మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ శతమానం భవతి సినిమా చెయ్యాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల చెయ్యలేకపోయాడు.అలాగే rx 100 మూవీని విజయ్ దేవరకొండ చెయ్యాల్సింది కానీ ఎందుకో ఈ సినిమాని విజయ్ ఒప్పుకోలేదు.ఇక నితిన్ రీసెంట్ గా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బింబిసార సినిమాని రిజెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశాడు. ఈ సినిమా అతను చేసుంటే అతని కెరీర్ కి చాలా పెద్ద ప్లస్ అయ్యేది. ఇక అర్జున్ రెడ్డి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. ఈ సినిమా కథ ముందుగా శర్వానంద్ దగ్గరకి వెళ్లగా అతను ఈ సినిమా చేసే సాహసం చెయ్యలేదు. కానీ ఈ సినిమాని విజయ్ దేవరకొండ చేసి ఓవర్ నైట్ లోనే టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయాడు.ఇలా మన యంగ్ హీరోలు హిట్ సినిమాలని మిస్ చేసుకొని బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: