మలయాళం సినీ రంగానికి చెందిన యువ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్ అకస్మాత్రిక మరణించినట్లు తెలుస్తోంది.ఆయన మృతి వార్త తెలుసుకున్న పలువురు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మొదటి చిత్రం దర్శకుడిగా ఈయన రూపొందించిన నాన్సీ రాణి సినిమా విడుదలకు ముందే ఆయన మరణించడంతో అభిమానులు కాస్త బాగోద్వేగానికి గురవుతున్నారు. అయితే హెపటైటిస్ వ్యాధి తో బాధపడుతూ నిమోనియా ఆరోగ్య సమస్య తో చికిత్స కోసం ఆస్పత్రి లో చేరారు జోసెఫ్.


కేరళలోని ఎర్నాకులం రాజగిరి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈనెల 25న కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. జేమ్స్ వయస్సు 31 ఏళ్లు మాత్రమే ఫిబ్రవరి 26వ తేదీన ఈయన అంత్యక్రియలు ముగించినట్లు తెలుస్తోంది. బాల నటుడుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన డైరెక్టర్ సాహు జేమ్స్ రూపొందించిన అయామ్ క్యూరియాస్ అనే సినిమా ద్వారా నటించారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా కో డైరెక్టర్ గా కూడా మలయాళ, బాలీవుడ్, కన్నడ వంటి సినిమాలకు పని చేసినట్లుగా తెలుస్తోంది.


ఇటీవల ఆయన నాన్సీ రాణి అనే సినిమాను దర్శకత్వం వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో అహోనా కృష్ణ అర్జున్ అశోకన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది అయితే మొదటి సినిమా థియేటర్లో చూడాలని కల తీరకుండానే జేమ్స్ మరణించిన జరిగింది. ఇక ఆయన కుటుంబ సభ్యులు తనకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అత్యంత సున్నితమైన పరిశీలన వ్యక్తి అద్భుతమైన ప్రతిభ కలిగిన డైరెక్టర్ అంటూ ప్రశంసించారు. అకాల మరణం చెంది అందరికీ దుఃఖాన్ని మిగిల్చారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభిమానులు ప్రార్థిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: