కోలీవుడ్ సీనియర్ హీరో కమలహాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'ఇండియన్' మూవీ అప్పట్లో ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి కొనసాగింపుగా ప్రస్తుతం 'ఇండియన్ 2' మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమలహాసన్ ప్రస్తుతం ఇండియన్ టు షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ నాలుగు సంవత్సరాల క్రితమే ప్రారంభమైనా.. పలు అనువార్య కారణాలవల్ల మధ్యలో షూటింగ్ ఆగిపోయింది. 

ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ని తిరిగి ప్రారంభించగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుగుతుంది. గత వారం రోజులుగా చెన్నై, పనైయుర్ వంటి ప్రాంతాల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సన్నివేశాల్లో తమిళ్, బ్రిటిష్ స్టంట్ మాస్టర్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఏకంగా ఏడుగురు విలన్స్ ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడుగురు లో ఒక విలన్ రోల్ ను సముద్రఖని చేస్తున్నారట. ఈ ఏడుగురు విలన్లతో కమలహాసన్ తలపడే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద ముగ్గురు హీరోయిన్లతో ఏడుగురు విల్లన్లతో ఇండియన్ 2 లో కమలహాసన్ బిగ్ స్క్రీన్ పై మరోసారి విజృంభించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని వేసవి కానుకగా విడుదల చేయాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే దర్శకుడు శంకర్ ఒకవైపు ఇండియన్ టు షూటింగ్ చేస్తూనే మరోవైపు రాంచరణ్ తో ఆర్సి 15 షూటింగ్ని కొనసాగిస్తున్నాడు. ఆర్.సి 15 షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, అంజలి తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: