ఈ సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో గోపీచంద్ మలినేని రాగా.. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి వచ్చాడు. అక్కడ డైరెక్టర్ ఇక్కడ హీరో ఎందుకు మెన్షన్ చేశామంటే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఒకటి రాబోతుందని టాక్. వీర సిం హా రెడ్డి చూశాక మరో బోయపాటి శ్రీను దొరికేశాడని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. దాదాపు ఇండస్ట్రీలో కూడా అదే టాక్. బోయపాటి కన్నా మెరుగ్గా బాలయ్యని చూపించాడని కూడా చెప్పుకున్నారు. ఏది ఏమైనా ఇన్నాళ్లు యువ దర్శకుడిగా ఉన్న గోపీచంద్ మలినేని బాలయ్య సినిమాతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

ఇక తన నెక్స్ట్ టార్గెట్ మెగాస్టార్ చిరంజీవి అని తెలుస్తుంది. ఇప్పటికే చిరుకి తగిన కథ సిద్ధం చేసుకుని ఆయన్ను కలిసి వినిపించడం జరిగిందట. చిరుకి కథ నచ్చి ఓకే అన్నట్టు టాక్. గోపీచంద్ మార్క్ కమర్షియల్ మాస్ సినిమాలో చిరుని చూస్తే అదిరిపోతుందని చెప్పొచ్చు. ఇంద్ర తరహాలో చిరుతో గోపీచంద్ ఒక మాంచి మసాలా సినిమా తీస్తే మెగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అన్నట్టే. గోపీచంద్ ఎలాంటి కథ చెప్పి బాస్ ని మెప్పించాడో కానీ ఈ కాంబో గురించి తెలియగానే ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది.

వీర సింహా రెడ్డి హిట్ కొట్టగానే స్టార్ హీరోలు గోపీచంద్ కి కాల్ చేసి మరి తమకు సూటయ్యే కథ సిద్ధం చేయమని అడుగుతున్నారట. ఓ పక్క వాల్తేరు వీరయ్య హిట్ అందుకున్న బాబీ కూడా హీరో కోసం వెతుకుతున్నాడు. మరి గోపీచంద్ మలినేని చిరుతో చేసినట్టుగా ఈయన కూడా బాలకృష్ణని కలిసి కథ చెబుతాడేమో చూడాలి. గోపీచంద్ చిరంజీవి కాంబో మాత్రం కరెక్ట్ సినిమా పడితే మరోసారి రికార్డుల రచ్చ షురూ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం చిరు భోళా శంకర్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ సినిమా తర్వాత అసలైతే వెంకీ కుడుములతో సినిమా ఉండాలి అది ఉందా లేదా అన్నది మాత్రం క్లారిటీ రావట్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: