
Ps -1 చిత్రాన్ని ఇతర భాషలలో ప్రేక్షకులకు పెద్దగా పట్టించుకోలేదని వార్తలు వినిపించాయి.పొన్నియిన్ సెల్వన్-2 చిత్ర ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసిన డేటికి విడుదల కావట్లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉండడంతో లైకా ప్రొడక్షన్స్ వారు ఈ విషయం పైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. Ps -2 సినిమా ఏ విధంగా వాయిదా పడలేదు ఇప్పటికే అనౌన్స్మెంట్ చేసిన తేదీ ప్రకారమే ఏప్రిల్ 28 ని ఈ సినిమా విడుదలవుతోంది అంటూ క్లియర్ గా తెలియజేయడం జరిగింది.
దీంతో పొన్నియిన్ సెల్వన్-2 వాయిదా పడుతుంది అని రూమర్స్ కి చెక్ పడినట్లే అని చెప్పవచ్చు.ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా అనుకున్న రోజే అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా కూడా స్థాయిలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగులో భారీ అంచనాలను మధ్య విడుదలవుతున్న ఏజెంట్ సినిమా ps -2 కి థియేటర్స్ విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమాల విషయంలో నెగ్గుతారా అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.