తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో శ్రీ లీల కూడా ఒకరు దాదాపుగా ఈమె చేతుల ప్రస్తుతం 9కి పైగా సినిమాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పవన్, మహేష్ సినిమాలలో ఈమె కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. అలాగే బాలయ్య కూతురుగా కూడా మరొక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ స్థాయిలో ఆఫర్లు ఉన్నా ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ మాత్రం ఏమాత్రం పెంచలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.


శ్రీ లీల రెమ్యూనరేషన్ ఒక చిత్రానికి కోటిన్నర రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం. ఈ మొత్తం కూడా ఎక్కువేనని కొంతమంది తగ్గించుకోవాలని నిర్మాతలు శ్రీ లిలా ను కోరుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈమె మాత్రం పారితోషకం తగ్గించుకొని ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే రెమ్యూనరేషన్ డబల్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. హీరోలు రెమ్యూనరేషన్ ఊహించని రేంజిలో పెంచిన సైలెంట్ గా ఉంటుందని నిర్మాతలు సైతం హీరోయిన్లు కాస్త రెమ్యూనరేషన్ ని పెంచితే ఆఫర్లు ఇవ్వడం లేదని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.


ఇక హీరోయిన్గా స్టార్ స్టేటస్ ను అందుకోబోతున్న శ్రీ లీల రెమ్యూనరేషన్ ఆశించిన రేంజ్ లో పెంచలేదు.కానీ రాబోయే రోజుల్లో ఇమే ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. పలు రకాల యాడ్స్ ద్వారా కూడా ఈమె బాగానే సంపాదిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా ఎక్కువగా ఈమెను తమ సినిమాలలో నటింప చేసే విధంగా చూసుకుంటున్నారు. ఇక యావరేజ్ సినిమాలను కూడా తన టాలెంట్ తో సక్సెస్ చేస్తున్న శ్రీలీలాకు ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతుల తొమ్మిది సినిమాలు ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: