విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ ఒక్క మూవీ తోనే సందీప్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అలా అర్జున్ రెడ్డి మూవీ తో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడి గా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్న సందీప్ ఆ తర్వాత ఇదే కథను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా కబీర్ సింగ్ అనే పేరుతో రూపొందించాడు.

భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా హిందీ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. దానితో కబీర్ సింగ్ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కబీర్ సింగ్ మూవీ తో సందీప్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ లభించింది. దీనితో ప్రస్తుతం ఈ దర్శకుడు బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ తో మూవీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

అందులో భాగంగా ప్రస్తుతం సందీప్ ... రన్బీర్ కపూర్ తో యానిమల్ అనే మూవీ ని రూపొందిస్తాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ఈ మూవీ ని 11 ఆగస్టు 2023 వ సంవత్సరం విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో రన్బీర్ కపూర్ "యానిమల్" మూవీ గురించి మాట్లాడుతూ ... ఈ సినిమా కథ నటుడిగా నన్ను కదిలించిందని ... నటుడిగా తాను ఇటువంటి పాత్ర ఎప్పుడూ చేయలేదని రణబీర్ తాజాగా అన్నారు. యానిమల్‌ మూవీ లో తాను పోషించే పాత్రలో గ్రే షేడ్స్ ఉన్నాయని రణబీర్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: