నేషనల్ క్రష్ గా టాప్ రేంజ్ ఇమేజ్ ని పెంచుకుని తెలుగు తమిళ హిందీ సినిమా రంగంలో ఒకేసారి ఒక చుట్టు చుట్టేద్దామని ఆమె వేసుకున్న మాష్టర్ ప్లాన్ ఫెయిల్ అయిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా క్రేజీ హీరొయిన్ గా మారిపోయిన రష్మిక కు ఆతరువాత వచ్చిన ఆమె సినిమాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడం ఆమె కెరియర్ కు చిన్న బ్రేక్ పడినట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

గత సంవత్సరం ఆమె తెలుగులో చాల సినిమాలలో నటించింది. ఆసినిమాలలో ‘సీతారామం’ సక్సస్ అయినప్పటికీ ఆ క్రెడిట్ మృణాల్ ఠాకూర్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఆమె బాలీవుడ్ పై పెంచుకున్న ఆశలు అన్నీ నీరుకారిపోయాయి. అమితాబచన్ తో కలిసి నటించిన ‘గుడ్ బై’ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఇక ఈ సంవత్సరం తమిళ టాప్ హీరో విజయ్ తో కలిసి నటించిన ‘వారసుడు’ మూవీకి విజయ్ ఇమేజ్ వల్ల తమిళనాడులో కలక్షన్స్ వచ్చాయి కానీ తమిళ ప్రజలు ఎవరు రష్మిక గ్లామర్ గురించి మాట్లాడుకోలేదు.

బాలీవుడ్ లో హీరో సిద్ధార్థ్ మలహోత్ర తో కలిసి ఆమె నటించిన ‘మిషన్ మజ్ను’ ఓటీటీలో వచ్చినప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకులు ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఈమధ్య ఒక ఫిలిం ఫంక్షన్ కు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని తన క్రేజ్ పెంచుకుందామని విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేసినప్పటికీ క్రేజ్ సంగతి ఎలా ఉన్నా విమర్శలు వచ్చాయి. దీనితో ప్రస్తుతం ఆమె నటిస్తున్న రెండు భారీ బడ్జెట్ సినిమాల పైన ఆమె ఆశలు పెట్టుకుంది.

ఆ లిస్టులో ప్రధమ స్థానంలో ఆమె నటిస్తున్న ‘పుష్ప 2’ ఉన్నప్పటికీ ఈ సీక్వెల్ లో రష్మిక పాత్రను కథ రీత్యా సుకుమార్ తగ్గించాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి. ఇక సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ సినిమాలో ఆమె రణబీర్ కపూర్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ ఆమూవీలో కూడ ఆమె పాత్ర అంతంత మాత్రమే అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో చేతిలో రెండు భారీ సినిమాల ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఆ రెండు సినిమాలలో ఆమె పాత్రలు అంతంత మాత్రమే అవ్వడంతో రష్మిక కెరియర్ కు ఆదిలోనే బ్రేక్ పడుతోందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: