మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం చిరంజీవి సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయిన వాల్తేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ క్రేజీ మూవీ కి సంగీతం అందించాడు.

రవితేజ కీలకమైన పాత్రలో నటించిన ఈ మూవీ లో కేథరిన్ ... రవితేజ భార్య పాత్రలో నటించింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసులు చేసి బ్లాక్ బాస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య మూవీ తో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా రూపొందిన వేదాలం అనే మూవీ కి అధికారిక రీమిక్ గా రూపొందుతుంది.

భోళా శంకర్ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కీర్తి సురేష్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ సోమవారం నుండి సెట్ లో ప్రారంభం కాబోతున్నట్లు ... ఈ షెడ్యూల్లో ఈ మూవీ యూనిట్ చిత్ర బృందం పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: