టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీనియర్ నటులు కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. తక్కువ సమయంలోనే వెండితెరపై అగ్ర హీరోగా ఎదిగాడు. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ మంచి సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. 47 ఏళ్ల వయసు వచ్చినా.. మహేష్ ఇంకా కాలేజీ కుర్రాడు లాగే చాలా యంగ్ గా కనిపిస్తాడు. అందుకు కారణం మహేష్ ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. నిజానికి మహేష్ బాబు తండ్రి కృష్ణ కూడా ఫిట్నెస్ విషయంలో చాలా కరెక్ట్ గా ఉంటారు. అలాగే ఆమె కూతురు మంజుల కూడా ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది. 

ఇలా ఘట్టమనేని ఫ్యామిలీలో అందరూ ఫిట్నెస్ కే ప్రాధాన్యత ఇస్తారు. అయితే మహేష్ బాబు గ్లామర్, ఫిట్నెస్ తదితర అంశాల గురించి అతని సోదరి మంజుల ఓ ఇంటర్వ్యూలో చెబుతూ మహేష్ సీక్రెట్స్ కొన్ని బయట పెట్టింది. ఫిట్నెస్ విషయంలో మహేష్ అన్ని పక్కగా ప్లాన్ చేసుకుంటాడని.. ఒత్తిడికి చాలా దూరంగా ఉంటాడని చెప్పింది. ముఖ్యంగా ఫిట్నెస్ కి చాలా ప్రాధాన్యత చేస్తాడని చెప్పుకొచ్చింది. అందుకే ఈరోజు మహేష్ ఇంత యంగ్ గా ఉన్నాడంటూ మంజుల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో కింగ్ నాగార్జుననే అనుకునేవాళ్లం. కానీ ఫిట్నెస్, గ్లామర్ విషయాల్లో నాగార్జున కంటే మహేష్ బాబు ఇచ్చే ప్రాధాన్యతే ఎక్కువట.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'SSMB 28' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి అయోధ్యలో అర్జునుడు, ఆరంభం, అర్జునుడు వంటి టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీ టైటిల్ విషయమై చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: