మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో దేశం గర్వించ దగ్గ గొప్ప దర్శకుల్లో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ టైటిల్ ను రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం "సీఈఓ" అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు ... దాదాపుగా ఈ టైటిల్ నే ఈ మూవీ కి ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీకాంత్ , అంజలి , సునీల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించరున్నారు. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నేటింట వైరల్ గా మారింది  ఈ మూవీ లో సెకండ్ హాఫ్ లో ఒక అద్భుతమైన కీలకమైన పాత్ర ఉండబోతున్నట్లు ... ఆ పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కనిపించే అవకాశం ఉన్నట్లు ... ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ సినిమాకు ఈ పాత్ర హైలెట్ గా నిలవనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాత ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: