టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మీటర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి శ్రీ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కిరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు ఈ మూవీ టీజర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది.   

మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం ... ఈ మూవీ టీజర్ లో కిరణ్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం తో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ టీజర్ కూడా బాగుండడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి మొదటి పాట అయినటు వంటి చమ్మక్ చమక్ పోరి సాంగ్ ను మార్చి 15 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది.

అలాగే ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ను కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ పాటకు సంబంధించిన మరో అప్డేట్ ను ఈ చిత్ర బృందం ప్రకటించంది. ఈ సాంగ్ ను రేపు సాయంత్రం 5 గంటలకు సంధ్య 70 ఏం ఏం ... హైదరాబాద్ లో గ్రాండ్ గ విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: